దేశీయ మార్కెట్లలో వరుసగా రెండో రోజు అదే ఊగిసలాట నెలకొంది. 250 పాయింట్లకు పైగా లాభాల్లో మొదలైన సెన్సెక్స్ కాసేపటికే ఆరంభ లాభాల్లో కొంత కోల్పోయింది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 77 పాయింట్లు పెరిగి 79,591 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 24,179 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 1 పైసా పెరిగి 84.39గా ట్రేడ్ అవుతుంది.