ఓరి దేవుడో.. ఈ షూ ఖరీదు రూ.164 కోట్లా!

66చూసినవారు
ఓరి దేవుడో.. ఈ షూ ఖరీదు రూ.164 కోట్లా!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ విలువ వేలు, లక్షలు కాదు కోట్లు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ షూ పేరు మూన్ స్టార్ షూస్. దీనిని ఇటాలియన్ షూ డిజైనర్ ఆంటోనియో వియెట్రి తయారు చేశారు. ఈ అద్భుతమైన షూ 2019లో దుబాయ్‌లో జరిగిన MIDE ఫ్యాషన్ వీక్ సందర్భంగా ప్రదర్శించబడింది. ఈ షూ ధర 19.9 మిలియన్ డాలర్లు అంటే అప్పటి లెక్క ప్రకారం.. దాదాపు రూ. 164 కోట్లు. ఈ షూ తయారీ కోసం అర్జెంటీనా 1576 సంవత్సరానికి చెందిన ఉల్క ముక్కను కూడా ఉపయోగించారట.

సంబంధిత పోస్ట్