ఏపీలో ప్రస్తుతం 7 ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. కొత్తగా కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, తుని-అన్నవరం, ఒంగోలులో విమానాశ్రయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఫీజిబిలిటీ సర్వే పూర్తి కాగా, మిగతా చోట్ల సర్వే చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు కోరారు. గన్నవరంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం థీమ్‌తో నిర్మించనున్నారు.