బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో కొందరు రైలింజన్‌పై నిలబడి ఈలలు వేస్తూ, గోల చేస్తూ, వీడియోలు తీసుకుంటూ వెళ్తున్నారు. వీరు మాత్రమే కాకుండా వీరితో పాటూ ఓ చిన్న పిల్లాడిని కూడా అక్కడే నిలబెట్టారు. ఇలా చాలా దూరం వరకూ వారు రైలు ఇంజిన్‌కు ముందు వైపు నిలబడి వెళ్లారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.