మా ప్రభుత్వం అడగకుండానే రైతుబంధు ఇచ్చింది: కేటీఆర్‌

73చూసినవారు
మా ప్రభుత్వం అడగకుండానే రైతుబంధు ఇచ్చింది: కేటీఆర్‌
కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని BRS వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్‌ అన్నారు. డిసెంబర్‌ 9న రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇంకా అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తామని సీఎం చెబుతున్నారని అన్నారు. రైతు బంధు గురించి అడిగితే మాపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతులు అడగకుండానే తమ ప్రభుత్వం రైతులకు రైతుబంధు ఇచ్చిందన్నారు.

సంబంధిత పోస్ట్