పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్‌పై బలూచిస్థాన్ వేర్పాటు వాదులు మరోసారి దాడికి దిగారు. కచ్ జిల్లాలో ఈ దాడికి పాల్పడ్డారు. దాడిలో పలువురు సైనికులు గాయపడగా, కొందరు మరణించినట్లు సమాచారం. పాక్ ఆర్మీ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని బాంబులతో దాడి చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.