ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 320/5 పరుగులు చేసింది. విల్ యంగ్ 107, టామ్ లేథమ్ 118 శతకాలతో అదరగొట్టారు. గ్లెన్ ఫిలిప్స్ 61, కాన్వే 10, మిచ్చెల్ 10 పరుగులు చేశారు. జట్టు సీనియర్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ 1 నిరాశపరిచాడు. పాక్ బౌలర్లలో హారిస్ రవూఫ్, నసీం షా చెరో రెండు వికెట్లు, అబ్రార్ అహ్మద్ ఒక వికెట్ తీసుకున్నారు.