హైదరాబాద్ లోని కూకట్ పల్లి సుమిత్రానగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జెఏవిఏ మోటార్ సైకిల్ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై ప్రారంభించారు. అనంతరం జెఏవిఏ మోటార్ సైకిల్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అభిమానుల కోరిక మేరకు ఎమ్మెల్యే దయాకర్ రావు మోటార్ సైకిల్ పై కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చారు. దయాకర్ రావు మాట్లాడుతూ షోరూమ్ ప్రారంభించడం సంతోషకరమన్నారు. అందరికీ అందుబాటులో మోటార్ సైకిల్ లు తేవడానికి యాజమాన్యం సరసమైన ధరలను నిర్ణయించారని తెలిపారు.