1852లో అమెరికా ఇన్వెంటర్ అయిన ఫ్రాన్సిస్ వొల్లే.. మొదటి పేపర్ బ్యాగ్ తయారీ యంత్రాన్ని తయారుచేశారు. దానిపై 1859 జూలై 12న పేటెంట్ పొందారు. ఆ తర్వాత 1971లో మార్గరెట్ ఇ నైట్ మరో రకమైన యంత్రాన్ని తయారుచేశారు. ఈ యంత్రం తయారుచేసే పేపర్ బ్యాగులకు కింద ఫ్లాటుగా.. బాక్స్ ఆకారం ఉండేది. 1883లో చార్లెస్ స్టిల్ వెల్.. పేపర్ బ్యాగ్‌లకు మరిన్ని మెరుగులు దిద్దగా.. 1912లో పేపర్ బ్యాగుల్ని పట్టుకునేందుకు వీలుగా దారాలను ఏర్పాటు చేశారు.