పారిస్ వేదికగా ఎంతో వైభవంగా ప్రారంభమైన ఒలింపిక్స్ ఇవాళ ముగియనున్నాయి. స్టేడ్ డి ఫ్రాన్స్ మైదానంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 12.30 గంటలకు ముగింపు వేడుకలు జరగనున్నాయి. 32 క్రీడాంశాల్లో 16 క్రీడాంశాల్లో భారత్ పాల్గొని ఆరు పతకాలు సాధించింది. ఈ వేడుకల్లో భారత పతాకధారులుగా షూటర్ మను బాకర్, హాకీ దిగ్గజం శ్రీజేష్ వ్యవహరించనున్నారు. ఈ ముగింపు వేడుకల ప్రత్యక్ష ప్రసారం LOKAL APPలో వీక్షించగలరు.