రైతు రుణమాఫీపై కేటీఆర్ సవాల్ విసరడాన్ని సిగ్గుచేటుగా ఉందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే ఏడాదిలో రూ.21 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేసిందని హర్షం వ్యక్తం చేశారు. రైతు బిడ్డ అయిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైతుల కష్టాలను చూసి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు.