ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో పర్యటించనున్నారు. గుర్లలో అతిసార ప్రబలిన క్రమంలో ఆ గ్రామానికి వెళ్లి అక్కడి పరిస్థితులపై సమీక్షిస్తారు. వాంతులు, విరేచనాలతో నాలుగు రోజుల వ్యవధిలో అక్కడ ఏడుగురు మృతి చెందారు. ఇంకా గ్రామంలో డయోరియా అదుపులోకి రాలేదు. వంద మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు.