ఘనంగా నల్ల నర్సింహులు వర్ధంతి వేడుకలు

55చూసినవారు
ఘనంగా నల్ల నర్సింహులు వర్ధంతి వేడుకలు
పెద్దపల్లి : సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లో శ్రీ చేనేత సహకార సంఘం నందు భారత స్వాతంత్ర సమర యోధుడు మరియు తెలంగాణ ఉద్యమకారుడు వర్ధంతి వేడుకలు తెలంగాణ పద్మశాలి యువజన సంఘం మరియు విద్యార్థి సంఘం నాయకులు నల్ల నరసింహులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈయన స్వాతంత్య్ర సమరయోధుడు అని తెలంగాణ ఉద్యమంలో కూడ అనేక ఉద్యమాలు చేశాడని కొనియాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వర్ధంతి వేడుకలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఈకార్యక్రమంలో పద్మశాలి విద్యార్థి విభాగం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు తుమ్మ నిశాంత్ మరియు ఉపాధ్యక్షులు గోలి సాయి చంద్ర,గోలి శ్రీనివాస్, మల్యాల సంపత్, అజయ్, శ్రీకాంత్, విజయ్, దీరజ్,అగయ్య తదితరులు చేనేత కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్