పెద్దపల్లి జిల్లా సామిల్ అసోసియేషన్ అధ్యక్షులు, గౌతమీ నగర్ సాయిబాబా టెంపుల్ చైర్మన్ నిమ్మ ధర్మారెడ్డి శనివారం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ను గోదావరిఖనిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా సామిల్ అసోసియేషన్ పరిస్థితుల గురించి ఎమ్మెల్యేకు వివరించారు. ఆయన వెంట పలువురు అసోషియేషన్ సభ్యులు,
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.