విషాదం.. గుండెపోటుతో చిన్నారి మృతి
TG: మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు పట్టణంలో పండగ పూట తీవ్ర విషాదం నెలకొంది. పద్మనగర్ కాలనీకి చెందిన నివృతి (12) అనే చిన్నారి శనివారం ఉదయం ఇంట్లో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలింది. గమనించిన కుటుంబీకులు నివృతి ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. చిన్నారి మృతితో కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.