TG: వచ్చే నెలలో పింఛన్ల పెంపు?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న తరుణంలో పింఛన్ల పెంపుపై సీఎం రేవంత్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వచ్చాక ఇస్తానని హామీ ఇచ్చినా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇవ్వలేదు. ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరించినా.. ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. వచ్చే నెలలోనే విజయోత్సవాల్లో రూ.2 వేల పింఛన్ రూ.4 వేలకు, రూ.4వేల దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు పెంచే ప్రకటన చేసే అవకాశం ఉంది.