వేములవాడ
నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపిన వేములవాడ వార్డ్ ఆఫీసర్స్
కొత్తకోట మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్న మామిండ్ల జయరాములుపై దాడిజరగడాన్ని వేములవాడ వార్డ్ ఆఫీసర్స్ తీవ్రంగా ఖండించారు. మున్సిపల్ కమిషనర్ కు శనివారం వినతి పత్రాన్ని సమర్పించారు. నల్ల బ్యాడ్జీలతో దాడిని ఖండిస్తూ నిరసన తెలిపినట్లు వార్డు ఆఫీసర్ మల్లారం అర్జున్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం సిగ్గుచేటని, వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.