వేములవాడ
వేములవాడ: స్వామివారి హుండీ ఆదాయం వివరాలు
వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి 32 రోజుల హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. రూ. 1 కోటి 50 లక్షల 24 వేల 507 రూపాయలు వచ్చినట్లు ఈవో వినోద్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బంగారం 170 గ్రాములు రాగా వెండి 9 కిలోల 800 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. హుండీ లెక్కింపులో ఈవో వినోద్ రెడ్డి, ఏసీ కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఆలయ సిబ్బంది, శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి వారు పాల్గొన్నారు.