ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్గత పోరు నడుస్తోందని అన్నారు. అధికార బీజేపీ నాయకులు తమలో తాము పోరాడుతున్నారని, అవినీతి చేయడంలో పరస్పరం పోటీ పడుతుండటంతో పరిపాలన అటకెక్కిందని దుయ్యబట్టారు. ప్రజల కోసం ఆలోచించే నాయకులు ఎవరూ కూడా బీజేపీలో లేరని ఆయన ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. వీరి అంతర్గత కుమ్ములాటతో ప్రజలు విసిగిపోయారన్నారు.