లోక్‌సభ ఎన్నికల్లో హరియాణలో కాంగ్రెస్ పార్టీ మెరుగైన సామర్ధ్యం కనబరించిందని, అత్యధిక ఓట్ల శాతంతో సత్తా చాటిందని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ హుడా అన్నారు. ఇవాళ జరిగిన కాంగ్రెస్ పార్టీ భేటీలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేశామని చెప్పారు. దేశమంతటా అధిక ఓట్ల శాతాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక్క హరియాణలోనే సాధించిందని, విపక్ష ఇండియా కూటమిని హర్యాణ ప్రజలు ఆదరించారని అన్నారు.