AP: విశాఖ వేదికగా.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రోడ్ షో, బహిరంగ సభలో కలిసి పాల్గొననున్నారు. ఈ క్రమంలో సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "ఎన్డీయే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకున్నారు.
రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని అవసరమైన నిధులు అందిస్తున్నారు. మోదీ.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకతాటిపై నడిపిస్తున్నారు. ఆత్మనిర్భర్, స్వచ్ఛభారత్ నినాదాలతో ప్రజల మనసు గెలుచుకున్నారు." అని పవన్ పేర్కొన్నారు.