ఏపీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో రెండు వర్గాలకు చెందిన యువకులు రెచ్చిపోయారు. పట్టపగలు నడి రోడ్డుపై సినిమా రేంజ్‌లో కొట్టుకున్నారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద రెండు గ్రూపులకు చెందిన వ్యక్తులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు ప్రదర్శించుకున్నారు. తాడిపత్రిలోని నంద్యాల రోడ్డులో ఉన్న 30 సెంట్లు స్థలం విషయంలో ఈ వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.