సినీ హీరో నివిన్ పౌలీపై పోలీసులు కేసు నమోదు

73చూసినవారు
సినీ హీరో నివిన్ పౌలీపై పోలీసులు కేసు నమోదు
మలయాళ సినీ హీరో నివిన్ పౌలీపై ఎర్నాకులం రూరల్ ఊన్నుకల్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ ఇటీవల నివేదిక ఇచ్చింది. తర్వాత పలువురు నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపులపై గళం విప్పుతున్నారు. ఇక ఓ యువతి ఫిర్యాదుతో నివిన్ పౌలీని ఆరో నిందితుడిగా ఎఫ్ఐఆర్‌లో పోలీసులు చేర్చారు. దుబాయ్‌లో తనపై లైంగిక దాడి జరిగినట్లు ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది.

సంబంధిత పోస్ట్