జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో నిరసన చేస్తున్న మహిళను ఓ పోలీస్ అధికారి కాలితో తన్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. గత నెలలో దేవసర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. అందులో ఒక వ్యక్తి మృతదేహాన్ని వాగులో ఆదివారం గుర్తించారు. మూడు రోజుల కిందట అదే వాగులో అతడి సోదరుడి మృతదేహం లభించింది. దీంతో బాధిత కుటుంబసభ్యులు, ఆ ప్రాంత వాసులు నిరసన చేపట్టారు.