టాలీవుడ్ నటుడు మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. దాడి చేశారంటూ తండ్రి మోహన్‌బాబు, కుమారుడు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు మోహన్ బాబు ఇంటికి విచారణకు వెళ్లారు. అనంతరం పోలీసులను మీడియా వివరణ కోరగా.. కేవలం కుటుంబ వ్యవహారమని, ఏం జరగలేదని తెలిపారు. మోహన్‌బాబు కుటుంబసభ్యులు అదే చెప్పారని వివరించారు.