‘ముఖ్య’ నేత చెప్పగానే రంగంలోకి దిగిన పీఎస్‌ఆర్.. కాదంబరిపై ఏ కేసు పెట్టాలి, ఎలా అరెస్టు చేయాలి, ఎవరెవరిని భాగస్వాములను చేయాలో చూసుకున్నారు. దీంతో పీఎస్‌ఆర్‌తో పాటు కాంతిరాణా, విశాల్ గున్ని, స్థానిక దర్యాప్తు అధికారి వరకూ అందరిపైనా ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ కుట్రలో కొందరు పోలీసులు తమకు చిక్కులు తప్పవని భావించి, అప్రూవర్లుగా మారారు. నాడు ఉన్నతాధికారుల ఆదేశానుసారమే తాము నడుచుకున్నామని దర్యాప్తు అధికారి స్రవంతిరాయ్ ముందు పూసగుచ్చినట్లు వివరించారు.