పూజా ఖేద్కర్ తల్లికి బెయిల్ మంజూరు

69చూసినవారు
పూజా ఖేద్కర్ తల్లికి బెయిల్ మంజూరు
భూ వివాదానికి సంబంధించి బెదిరింపు కేసులో మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ తల్లికి ఊరట దక్కింది. ఈ కేసులో మనోరమ ఖేద్కర్‌కు శుక్రవారం పూణె కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అడిషనల్ సెషన్స్ జడ్జి ఏఎన్ మారే బెయిల్ మంజూరు చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది సుధీర్ షా తెలిపారు. 2023లో పూణేలోని ముల్షి తహసీల్‌లోని ధద్వాలీ గ్రామంలో భూ వివాదంలో మనోరమ కొంతమందిని తుపాకీతో బెదిరించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్