దేశం విడిచి పారిపోయిన పూజా ఖేడ్కర్?

77చూసినవారు
దేశం విడిచి పారిపోయిన పూజా ఖేడ్కర్?
మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ ఆచూకీ తెలియడం లేదు. మోసం, ఫోర్జరీ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఈ క్రమంలోనే అరెస్టు భయంతో ఆమె దుబాయ్ పరారైనట్లు తెలుస్తోంది. ఈమేరకు పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై పూజా తరఫు స్పందన రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్