ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిపివేత

1065చూసినవారు
ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిపివేత
కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. చాలా రోజులుగా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బిల్లులు కట్టకుండా రూ.1.67 కోట్ల విద్యుత్ వినియోగించినట్టు అధికారులు తెలిపారు. దీనిపై 2015లోనే కేసు నమోదు చేశామని, 15 రోజుల క్రితం నోటీసులు కూడా పంపామని చెప్పారు. కాగా రేపు ఉప్పల్‌లో SRH-CSK మ్యాచ్ జరుగనుంది.

సంబంధిత పోస్ట్