అల్లు అర్జున్ ఇంటికి రానున్న ప్రభాస్!

77చూసినవారు
అల్లు అర్జున్ ఇంటికి రానున్న ప్రభాస్!
TG: చంచల్ గూడ జైలు నుంచి ఇంటికి చేరుకున్న హీరో అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. బన్నీ నివాసానికి ఇవాళ సాయంత్రం 4గంటలకు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, సుధీర్ బాబుతో పాటు తదితర నటీనటులు వచ్చారు. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నిన్న అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఇవాళ ఉదయం విడుదలైన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్