AP: విశాఖపట్నం జిల్లా భీమిలిలో విషాదం చోటు చేసుకుంది. గొల్లలపాలెంలో ఉంటున్న రాజేశ్వరి 3 రోజుల క్రితం ఎదురింట్లో ఉండే ఉజ్వలకు మిస్డ్ కాల్ ఇచ్చారు. దాంతో తనకు ఎందుకు మిస్డ్ కాల్ ఇచ్చావని రాజేశ్వరిని అడిగారు. పొరపాటున వచ్చిందని చెప్పినా అదే పనిగా అడగడంతో రాజేశ్వరి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో ఆమె బంధువులు భీమిలి పోలీస్ స్టేషన్ వద్ద శనివారం ఆందోళన చేశారు.