ఇస్లాంలోని ఐదు మూల స్తంభాల్లో జకాత్ కూడా ఒకటి. జకాత్ అనేది ఇస్లాంలో అవసరంలో ఉన్నవారికి తప్పనిసరిగా ఇచ్చే దానధర్మం. ముస్లిం మత నాయకుడు మౌలానా ఇబ్రహీం హుస్సేన్ ప్రకారం.. ప్రవక్త ముహమ్మద్ కాలం నుంచి ఈద్‌కు ముందు జకాత్ ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోంది. ఇది రంజాన్ నెల చివరిలో ఇస్తారు. ఇస్లాంలో, ఒకరి వార్షిక ఆదాయంలో 2.5% దానం చేయాలని ఆదేశాలు ఉన్నాయి.