వరదలకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

71చూసినవారు
వరదలకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నదీతీర ప్రాంతాల్లో, తరచుగా వరదలకు గురవడానికి అవకాశమున్న ప్రజలు వరదలు రావడానికి ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దగ్గరలోని పునరావాస కేంద్రాన్ని గుర్తించి అక్కడికి తొందరగా చేరే మార్గాన్ని తెలుసుకోవాలి. ప్రథమ చికిత్స పెట్టెలో మందులు, ఇతర సామాగ్రి ఉన్నాయా లేవో చూసుకోవాలి. రేడియో, టార్చిలైటు, బ్యాటరీలు, తాళ్లు, గొడుగు లాంటివి సమకూర్చుకోవాలి. మంచినీరు, ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు, ఇంధనం లాంటివి ముందుగానే సమకూర్చుకుని నిల్వ చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్