ప్రస్తుతం కురిసిన వర్షాలను ఉపయోగించుకొని వర్షాధార పత్తి పంటలో మొదటి దఫా, రెండవ దఫాపై నత్రజని, పొటాషియం ఇచ్చే ఎరువులను 20, 40 రోజుల దశలో అందించాలి. అధిక వర్షాల వల్ల పత్తిలో వడలు తెగులు ఆశించే వీలుంటుంది. దీని నివారణకు వడలు తెగులు సోకిన మొక్కల మొదళ్లు తడిచేలా లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు మొక్కల మొదళ్ల చుట్టూ పోయాలి.