చలికాలంలో దూడలను చలి, చలి గాలుల నుంచి కాపాడుకోవడానికి వెచ్చని నివాస వసతిని కల్పించాలి. ముఖ్యంగా రాత్రిపూట దూడలను షెడ్లలోనే ఉంచాలి. పాకలకు ఇరువైపులా గోనె పట్టాలను వేలాడ దీయాలి. పాకల్లో నేలపై రాత్రిపూట వరిగడ్డిని పరిచినట్లయితే వెచ్చగా ఉంటుంది. చలికాలంలో న్యూమోనియా సోకే ప్రమాదం ఉంది. దూడలు బొడ్డువాపు, విరేచనాలు, కడుపుబ్బడం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ వ్యాధులను వెంటనే గుర్తించి, డాక్టర్ల సలహాలను తీసుకోవాలి.