కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా టీమ్ ఎట్టకేలకు ట్రోఫీని గెలుచుకుంది. ప్రొవిడెన్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో సెయింట్ లూసియా కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో గయానా అమెజాన్ వారియర్స్‌ను ఓడించి తొలి కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) టైటిల్‌ను గెలుచుకుంది. ట్రోఫీని అందుకుంటున్న సమయంలో సెయింట్ లూసియా కెప్టెన్ డుప్లెసిస్ తన చేష్టలతో ఉర్రూతలుగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.