సోషల్ మీడియా పుణ్యమాని రోజుకో కొత్త రకం వంటకాన్ని మనం నెట్టింట చూస్తున్నాం. తాజాగా ఓ వ్యక్తి ఫాంటాతో ఎగ్ బుర్జీ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. కోల్‌కతాలో ఓ వీధి వ్యాపారి తయారు చేస్తున్న ‘ఆరెంజ్ సోడా బుర్జీ’ ఆకట్టుకుంటోంది. ఈ వంటకం చూసిన కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు షాక్ అవుతున్నారు. పెనంపై ఫాంటా పోసి అందులో కొన్ని గుడ్లు కొట్టి, ఉప్పు, ఇతర మిశ్రమాలు వేశాడు. డిష్ రెడీ అయిన తర్వాత ఆకులో వడ్డించాడు.