ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో ఎలిమినేషన్ ప్రక్రియ

69చూసినవారు
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో ఎలిమినేషన్ ప్రక్రియ
పట్టభ్రదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యతలో గెలుపునకు సరిపడే ఓట్లు ఏ అభ్యర్ధికి రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓటును లెక్కించడం ద్వారా విజేతను నిర్ణయించనున్నారు. పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల్లో తొలి ప్రాధాన్య ఓట్లు అతి తక్కువగా వచ్చిన వారిని గుర్తించి.. వారి బ్యాలెట్ పత్రాల్లో రెండో ప్రాధాన్య ఓటెవరికి వచ్చిందో వాటిని ఆ అభ్యర్థికి జమ చేస్తారు. అనంతరం తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని లెక్కింపు ప్రక్రియ నుంచి తప్పింస్తారు. ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.

సంబంధిత పోస్ట్