ఈడీ విచారణలో ‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాత

61చూసినవారు
ఈడీ విచారణలో ‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాత
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాత, నటుడు సౌబిన్ షాహీర్‌ను ఈడీ ప్రశ్నిస్తోంది. మనీలాండరింగ్ కేసులో ఆయనను ఈడీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మంజుమ్మల్ బాయ్స్ సినిమా రూ.20 కోట్లతో రూపొందించగా రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. 2006లో 10 మంది స్నేహితులు గుణ కేవ్స్ సందర్శనకు వెళ్తారు. అక్కడ సుభాష్ అనే వ్యక్తి లోయలో పడిపోతాడు. అతడిని ఎలా కాపాడారనేది సినిమా కథ.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్