పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫొగాట్‌కు బిగ్ షాక్ తగిలిన విషయం తెలిసిందే. అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది. దీంతో ఫొగాట్‌పై అనర్హత వేటు అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభలో లేవనెత్తారు. ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చించాలంటూ ఎంపీలు పట్టుబట్టారు. స్పందించిన ప్రభుత్వం వినేశ్ ఫొగాట్ అంశంపై ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర క్రీడా మంత్రి ప్రకటన చేస్తారని తెలిపింది.