ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఈ బ్యాంకుల్లో ఎఫ్‌డీ ఇన్వెస్ట్ చేయడానికి డెడ్‌లైన్ గడువు నవంబర్ 30 వరకు మాత్రమే ఉండేది. ఈ గడువును దాదాపు మరో 4 నెలలు పొడిగించి.. 2025, మార్చి 31 వరకు చేసింది. ఈ బ్యాంకులో కనీసం రూ. 10 వేల నుంచి గరిష్టంగా రూ. 3 కోట్ల వరకు డిపాజిట్లు చేయవచ్చు. వీటికి 7.30% వడ్డీ.. సీనియర్ సిటిజన్లకు 7.80%, సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.05% వడ్డీ రేట్లు వస్తాయి.