‘‘ కోల్‌కతాలోట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై గతవారం నేను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మరికొందరు వక్రీకరించారు. ఏదేమైనా జరిగిన ఘటన దారుణమైనది. దీనిపై సీబీఐ, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నేరస్తుడెవరో తెలిపోతుందని ఆశిస్తున్నా. అతడికి విధించే శిక్ష అత్యంత కఠినంగా ఉండాలి. అదెలా ఉండాలంటే.. భవిష్యత్తులో ఇంకెవరైనా ఇలాంటి దారుణానికి పాల్పడే సాహసం చేయకూడదు. శిక్ష చాలా తీవ్రంగా ఉండాలి’’ అని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.