భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలి రౌండ్ లోనే ఓటమి పాలైంది. ఇండోనేషియా మాస్టర్స్ 2025 టోర్నీలో సింధు ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. మహిళల సింగిల్స్ లో వియాత్నం క్రీడాకారిణి గుయెన్ టీఎల్ చేతిలో 20-21, 12-21 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. తొలి నుంచి ప్రత్యర్థిపై సింధు ఎలాంటి ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. కాగా ఆమె వెంకట దత్త సాయిని వివాహం చేసుకున్న తర్వాత.. సింధు ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే.