AP: మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని చంద్రబాబు వారిని కోరారు. ఏపీలో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహా మండలిలో భాగస్వామ్యం వహించాలని బిల్‌గేట్స్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బిల్ గేట్స్ తెలిపారు.