అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ అధికారంలో ఉన్న ‘ఆప్’ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో ఓటర్లు ఆలోచించి ఓటేయాలని కోరారు. లేనిపక్షంలో ఇప్పుడు కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలన్నీ నిలిచిపోతాయని వ్యాఖ్యనించారు. త్రిలోక్‌పురిలో ఈ మేరకు ప్రచారం నిర్వహించారు.