ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సరస్వతి ల్యాండ్స్ రద్దు

76చూసినవారు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సరస్వతి ల్యాండ్స్ రద్దు
AP: సరస్వతి భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయన్న అధికారుల నివేదికతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరస్వతి పవర్ ప్లాంట్‌కు కేటాయించిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. పల్నాడు ప్రాంతంలో సరస్వతి పవర్ ప్లాంట్స్‌కు కేటాయించిన భూముల్లో 24.85 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, అసైన్డ్ ల్యాండ్స్ కేటాయింపును రద్దు చేశారు.

సంబంధిత పోస్ట్