ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

51చూసినవారు
ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోని కొంతమంది సంపన్న వ్యాపారవేత్తలకు ప్రధాని ఓ సాధనంగా మారారని ఆరోపించారు. వారి బ్యాంకు రుణాలు మాఫీ చేశారంటూ విమర్శించారు. ‘ఇప్పటి వరకు 20-25 మందికి దాదాపు రూ.16 లక్షల కోట్లు ఇచ్చారు. భారత్‌లో రైతు సమస్యలపై ఆయన అసలు మాట్లాడరు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను ప్రస్తావించరు’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

సంబంధిత పోస్ట్