కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పెద్ద మనసు చాటుకున్నారు. ఇటీవలే వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని వయనాడ్ కోసం విరాళం ప్రకటించారు. తన ఒక నెల జీతం రూ.2.3 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. వయనాడ్‌లో పునరావాసం కోసం కార్యక్రమాలు చేపడుతున్న కేరళ కాంగ్రెస్ కమిటీకి (కేపీసీసీ) ఈ సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమకు వంతు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.