రాహుల్ గాంధీకి తప్పిన ప్రమాదం (వీడియో)

33535చూసినవారు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సోమవారం ప్రమాదం తృటిలో తప్పింది. బీహార్‌లోని పాటలీపుత్ర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి మీసాభారతికి మద్దతుగా ఆయన సభకు హాజరయ్యారు. ఆ సమయంలో స్టేజిలో కొంత భాగం కుప్పకూలింది. ఒక్క క్షణం రాహుల్ గాంధీ బ్యాలెన్స్ కోల్పోయారు. వెంటనే తేరుకుని పడిపోకుండా నిలబడ్డారు. అనంతరం సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్