తెలంగాణలో రానున్న మూడు గంటల్లో వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, సిద్ధిపేట, వికారాబాద్ వంటి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.